- – ర్యాంకర్‌ను సన్మానించిన అంబేద్కర్, బౌద్ధ మహా సభ
నేటి సాక్షి, వాంకిడి: వాంకిడి మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గం అర్జున్ జేఈఈ అడ్వాన్డ్స్‌లో ఆల్ ఇండియా 1782 ర్యాంక్ సాధించినందుకు డాక్టర్ అంబేద్కర్ సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు మహాప్రబ్ అశోక్ మహుల్కార్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గం అర్జున్ తండ్రి ఏడు నెలల క్రితం మరణించాడని, ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, పట్టుదలతో చదువుకొని ఎలాంటి కోచింగ్ లేకుండా జేఈఈ అడ్వాన్డ్స్‌లో ర్యాంక్ సాధించి, రానున్న యువతరానికి ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వాంకిడిలో చదువుకొన్న అర్జున్ను ఈ రకంగా తీర్చిదిద్దిన కళాశాల అధ్యాపకులు, అర్జున్ను అందరూ అభినందించారు.ఈ కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వినీష్ ఉప్రే, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు దుర్గం సునీల్, కార్యదర్శి రోషన్, సమాజం అధ్యక్షుడు విజయ్ ఉప్రే, దుర్గం శ్యామ్ రావు , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ, యువజన విభాగం అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్, అంబేద్కర్ సంఘం నాయకులకు సందీప్, అరుణ్, ప్రసాద్, ప్రతాప్, బౌద్ధ ఉపాసకులు పాండు జాడే, నాయకులు దీపక్, మహేశ్, కమలాకర్, రమేశ్, పాండు సాయి,హేమత్ తదితరులు పాల్గొన్నారు.