Thursday, March 5, 2026

జేఈఈ మెయిన్స్ లో“ రేస్” విద్యార్థుల ప్రభంజనం!

నేటి సాక్షి : కోదాడ99.56 పర్సంటైల్ తో సత్తా చాటిన రేస్ విద్యార్థులు..జాతీయస్థాయి టాపర్ ను అభినందించిన చైర్మన్ బాణాల వసంత రెడ్డి..జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కోదాడ రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో వరుసగా అద్భుతమైన ప్రతిభను కనబరిచి,. ఉత్తమ ర్యాంకులు సాధించారు. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ (సెషన్-1) ఫలితాలలో అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో మెరుగైన స్కోరు సాధించారు. కళాశాలకు చెందిన ముక్కా చరణ్ సాయి గౌడ్ 99.56 పర్సంటేల్ సాధించాడు.ఈ సందర్భంగా చైర్మన్ బాణాల వసంత రెడ్డి జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఏడాది మా సంస్థ నుండి గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు ఎన్ఐటీ (NIT), ట్రిపుల్ ఐటీ (IIIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో మరియు జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశాలకు అర్హత సాధిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, ఒత్తిడి లేని వాతావరణంలో కాన్సెప్ట్ ఆధారిత బోధన అందించడం ద్వారా ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల కృషిని, అధ్యాపకుల అంకితభావాన్ని అభినందిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఐఐటీ స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, సాంబశివరావు, సతీష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News