గ్రామపంచాయతీ సిబ్బందికి శాశ్వత ఉద్యోగ భద్రత డిమాండ్ నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి. శ్రీకాంత్) గ్రామపంచాయతీ ఉద్యోగ సంఘాల హడ్ హక్ కమిటీ ఏర్పాటు.పాల్గొన్న రాష్ట్ర,జిల్లా నేతలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామపంచాయతీలో ఆదివారం గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశంలో మూడు సంఘాల రాష్ట్ర అధ్యక్షుల అనుమతితో రాష్ట్ర జేఏసీ అడ్ హక్ కమిటీ కన్వీనర్లను ఎన్నుకున్నారు. సమావేశంలో మూడు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మామిడాల నరసింహులు,సాదుల శ్రీకాంత్,బింగి గణేష్ ల ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గాను ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు గాను ఐక్య కార్యాచరణ రూపొందించేందుకు ప్రకటించారు.త్వరలో ఈ మేరకు అన్ని సంఘాల బాధ్యులతో మరో సమావేశం ఏర్పాటు చేయనట్లు వారు ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోవర్ బిల్ కలెక్టర్లను జీవో 51 నుంచి మినహాయింపు చేయాలని,పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పెర్మనెంట్ చేయాలని,కారోబార్,బిల్ కలెక్టర్లను పంచాయతీ అసిస్టెంట్లుగా నియమించాలని,గ్రామపంచాయతీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల సిబ్బందికి కనీస అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర జేఏసీ అడ్హక్ కన్వీనర్లుగా పిళ్లి రవి,మేకల శ్రీధర్,కంజర్ల భాస్కర్,జంగయ్య, వంగ రవీందర్,మురళి,కొండ గొర్ల శీను,అంకం సదానందం,రత్నాపురం పద్మారావు,చిలుక మారుతి.సిహెచ్ మల్లా చారి లను ఎన్నుకున్నారు.హడ్ హాక్ కన్వీనర్లతో తో పాటు అన్ని సంఘాల రాష్ట్ర అధ్యక్షులతో హైదరాబాదులో త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు.కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,జిల్లా ముఖ్య నాయకులు జొన్నకోటి వెంకటేష్,బాలరాజు,శ్రీనివాస్,దయాకర్ రెడ్డి,ములుగు సురేందర్,రాగల లక్ష్మణ్,పరశురాములు రాజు,విజయ్,సంతోష్ కుమార్,కృష్ణ,కనుకయ్య,రమేష్,తిరుపతి,మహేందర్,శేఖర్ కొమురవెల్లి ప్రదీప్ సతీష్,ప్రభాకర్,గొల్లపల్లి బాబు,ఇప్ప వెంకటేష్,బాలరాజు,ఆంజనేయులు,రాజ్ మీరు, రాజేందర్,అశోక్,తదితరులు పాల్గొన్నారు.

