నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 23చౌడేపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జోనల్ మలేరియా అధికారి డాక్టర్ నిర్మల్ అలెగ్జాండర్ అకస్మికంగా పర్యటన చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల సందర్శన చేయాలని, గ్రామాలలో పారిశుద్యం, పరిశుభ్రతలను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పరివేక్షణ చేయాలని,ఎవైన పరిశుభ్రత పై సమస్యలు ఉంటే సంబందిత ఆప్ లో పిర్యాదులు నమోదుచేయాలని, సదరు పిర్యాదులను సంబందిత అధికారులు పరిష్కారం చేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల హరిప్రసాద్ రాయల్, చిట్రెడ్డిపల్లి మురళి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.





