Saturday, March 21, 2026

*జ్యువెలరీ షాపులో..ఇదో టైపు చోరీ.!*—————-* బుర్కా ధరించిన మహిళతో పాటు వచ్చిన వ్యక్తి చోరీ* జగిత్యాలలో రింగ్ మార్పిడి దొంగతనం——–*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఉన్న ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో ఒక అసాధారణ రింగ్ మార్పిడి దొంగతనం జరిగింది. పూర్తిగా బుర్కా ధరించిన ఓ మహిళతో పాటు ఓ పురుషుడు కస్టమర్లుగా వచ్చి, ఖరీదైన బంగారు ఉంగరాలు చూపించమని అడిగారు. సేల్స్‌మెన్ అతి జాగ్రత్తగా రూ.లక్షల విలువ చేసే రెండు మూడు ఉంగరాలు ట్రేలో పెట్టి చూపించగా, ఆ మహిళ ఒక ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు నటించింది.*చాకచక్యంగా డూప్లికేట్ పెట్టి, అసలు ఉంగరం జేబులో పడేశారు*కొద్ది నిమిషాల పాటు వ్యవధిలోనే మహిళ చేతిలో ఉన్న అసలైన బంగారు ఉంగరం స్థానే ఇంతకుముందు సిద్ధంగా తెచ్చుకున్న డూప్లికేట్ (నకిలీ) ఉంగరాన్ని అందులో పెట్టి, నిజమైనది తన బుర్కా జేబులో దాచేసుకుంది. ఇద్దరూ ఏమీ కొనకుండానే..మళ్లీ వచ్చి తీసుకుంటాం అంటూ షాప్ నుంచి బయటకు వెళ్లిపోయారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే ట్రేలో ఉన్న ఉంగరం తేలికగా, నాణ్యత లేకపోవడం గమనించిన సిబ్బంది యజమానికి సమాచారం అందించారు. వెంటనే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.*సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రయత్నం* పోలీసులు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని దొంగలను గుర్తుపట్టే పని ప్రారంభించారు. బుర్కా కారణంగా మహిళ ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, ఆమెతో వచ్చిన పురుషుడి నడక, శరీర భాష, దుస్తుల ఆధారంగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇదే తరహా రింగ్ మార్పిడి ద దొంగతనాలు జరుగుతుండటంతో, ఒకే గ్యాంగ్ పని కావచ్చనే అనుమానంతో దర్యాప్తు వేగవంతం చేశారు.!___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News