నేటి సాక్షి న్యూస్ :చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, పెద్దకొండామర్రి కి చెందిన దివాకర్ రెడ్డి భార్య పుష్పావతి(27) టమాటా మందుతాగి ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబ సభ్యుల వివరాల బుదవారం ఇంట్లో ఎటువంటి గొడవలు లేవని,బుదవారం ఉదయం ఇంటి ఆవరణలో మోనోక్రోటోపాస్ మందు తాగి అపస్మారక స్థితి లో పడిఉండగా కుటుంబ సభ్యులు చూసి చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకొని వచ్చి ప్రథమ చికిత్స అందించారు.పరిస్థితి విషమించడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృతిచందినట్లు అక్కడ వైద్యులు నిర్దారించారు. ఐతే పుష్పావతి గత కొన్ని రోజులుగా హెర్నియా తో బాదపడుతుందని,వారి కుటుంబ సభ్యులు తెలిపారు.పుష్పావతి మృతదేహాన్ని ఆవిడ పుట్టినిల్లు దేవరగుడిపల్లికి తీసుకొని వచ్చారు.ఈ విషయం పైన పోస్టుమార్టం చేయాలని మొదటగా పట్టుపట్టిన కుటుంబ సభ్యులు, తర్వాత పెద్దమనుషులు మాట్లాడుకొని రాజీమార్గం చేసుకున్నామని వారు తెలియజేశారు. ఈ విషయం పై పోలీసులు కూడా దేవరగుడిపల్లి కి చేరుకుని,విచారణ చేసి వెనుతిరిగారు. గ్రామంలో విషాదచాయలు అములుకున్నాయి.





