నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఎఎస్టీఎఫ్) కార్యాలయంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు సూచనల మేరకు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా అమరవీరులను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. నివాళులర్పించిన తరువాత టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ 1959 అక్టోబరు 21న సీఆర్ పీఎఫ్ డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో చైనా చేసిన మెరుపు దాడుల్లో 16మంది జవాన్లు మరణించిన రోజును సంస్మరణ దినోత్సవంగా జరుపుకంటున్నట్లు తెలిపారు. 2023లో టాస్క్ ఫోర్సు కానిస్టేబుల్ బి. గణేష్ మరణించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈనెల 31వరకు అమర వీరులను సంస్మరిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన అమరవీరులను స్పూర్తిగా తీసుకుని విధులను నిర్వహించాలని సూచించారు. దీనికి ముందు డీఎస్పీ ఎండీ షరీఫ్ గత సంవత్సరం దేశ వ్యాప్తంగా మరణించిన అమర వీరుల పేర్లను చదివి వినిపించారు. కార్యక్రమాన్ని ఆర్ఐ సాయి గిరిధర్ నిర్వహించారు. ఆర్ ఎస్ ఐ విష్ణు వర్ధన్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎసీఎఫ్ శ్రీనివాస్, సీఐలు సురేష్ కుమార్, ఖాదర్ భాషా, ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.





