Friday, March 6, 2026

టిఆర్జిఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ధీరావత్ శ్రీను నాయక్ ఎన్నిక

నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం వ్యవస్థాపకులు ధీరావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో నూతన కమిటీని ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా టిఆర్జిఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ధీరావత్ శ్రీను నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపి, ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ధీరావత్ శ్రీను నాయక్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు, గిరిజన సమస్యల పరిష్కారం దిశగా ఉద్యమాలు నిర్వహిస్తూ, సంఘం బలోపేతంకు ముందుకు కొనసాగిస్తానని వారు పేర్కొన్నారు. అలాగే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసేంతవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని, బంజారాలు మాట్లాడే గోర్, బోలి భాషను జాతీయ భాష గుర్తించాలి, తండా గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి, గిరిజన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని కోరారు. తన ఎన్నుకకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం వ్యవస్థాపన అధ్యక్షులు ధీరావత్ రవి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్, ఆంబోతు వెంకన్న నాయక్, జవహర్ నాయక్, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News