Saturday, March 21, 2026

టీడీపీకి చంద్రబాబే సేనాధిపతి ప్రతి కార్యకర్త ఒక సైనికుడే మనమంతా సైనికులం – పదిహేనేళ్లపాటు కూటమిగానే ముందుకెళ్తామన్న, ఎమ్మెల్యే గిత్త. జయసూర్య.

నేటి సాక్షి డిసెంబర్ 05 పాములపాడు :– మండలం కేంద్రమైన పాములపాడులో టిడిపి కార్యకర్తల సమావేశాన్ని మండల నాయకులతో కలిసి గిత్త జయసూర్య నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను ఎక్కడికి వెళ్లినా ముందుగా కార్యకర్తలను కలిశాకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారన్నారు అధికారంలోకి రావడానికి దశాబ్ధాలుగా ఎత్తిన పసుపుజెండా దించకుండా కష్టపడిన ప్రతి కార్యకర్త శ్రమదాగి ఉందని గుర్తు చేశారు.వేదికపై ఉన్న నాయకులందరం అదృష్టవంతులమని, అయిదేళ్లు మీరు మా వెంట నిలిచారని, నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలే అండగా నిలిచారని అన్నారు. చంద్రబాబుని 53రోజులు జైల్లో పెడితే అండగా నిలబడి బయటకొచ్చి పోరాడింది కార్యకర్తలేనని, అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత అద్భుతమైన కార్యకర్తలు టీడీపీకి మాత్రేమే సొంతమని, ఒక్క పిలుపు ఇస్తే సైన్యంలా తరలివచ్చే కేడర్ మనకే సొంతమని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ *ముఖ్యమంత్రి సహాయ నిధి* ( *CMRF* ) ద్వారా మండలం లోని వాడల గ్రామానికి చెందిన, కే శమంతకమణి 42378/- రూపాయలు వేంపెంట గ్రామానికి చెందిన రొక్కం సుకుమార్ 40000/- రూపాయలు CMRF ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News