నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- అనంతపురం జిల్లా లోని సింగనమల నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు లో జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేళ స్థానిక మండల కేంద్రంలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమన్నాయి. స్థానిక మండల కేంద్రంలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో కేక్ కటింగ్ లో ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. గతం నుండి దాసరి కుటుంబానికి దొడ్లో కుటుంబాల మధ్య పెద్ద వార్ జరుగుతుంది. అయితే ఈ ఘర్షణ కాస్త వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోగతి విజయ్ ప్రతాప్ రెడ్డికి చుట్టుకుంది. దాసరి కుటుంబంలోని సంతోష్ కుమార్ ను దొడ్లో కుటుంబ సభ్యులు చుట్టుముట్టి కొడుతున్నారని తెలుసుకున్న బోగతి విజయ్ ప్రతాప్ రెడ్డి పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయినా పోలీసులు మౌనంగా ఉన్నారని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్రతాప్ రెడ్డి ధర్నా దిగాడు. అప్పటికే ముందస్తు ప్రణాళిక చేసుకున్న టిడిపి వర్గం కర్రలతో దాడికి దిగడం తో ఇరు వర్గాలు రాళ్లు కర్ర లతో దాడి చేసుకున్నాయి. దాడిలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఈ దాడుల్లో వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి. టీడీపీ నేతల దాడికి నిరసనగా వైసీపీ ధర్నా..అయితే టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా వైసీపీ నేతల ధర్నాకు దిగారు. ఈ సమయంలోనూ రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. దీంతో గాయాలతోనే యల్లనూరు పీఎస్ వద్ద జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమపై దాడి చేసిన టీడీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో ఫిర్యాదును స్వీకరించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరోసారి ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు..భయాందోళన లో ప్రజలు..గత ప్యాక్షన్ మళ్ళీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందనే భయం ప్రజలను వెంటాడినట్లవుతుంది. గత ఘర్షణల వల్ల స్థానిక కేంద్రంలో శుభకార్యాలు అంతంత మాత్రమే, ఇప్పుడిప్పుడు కొంత ప్రశాంత జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో తిరిగి అలాంటి సంఘటనలు జరగడం జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లా ఎస్పీ దీని పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.~~~~~~~~~~~~~~~~~

