నేటి సాక్షి జోగులాంబ గద్వాల్:* జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను వాయిదా వేయాలని జోగులాంబ గద్వాల జిల్లా స్వేరో జిల్లా అధ్యక్షులు బండారి సునంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణలో చాలామంది పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికలు అయిపోగానే వారికి టెట్ పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లభించలేదన్నారు. అందువలన పరీక్షకు సిద్ధం అవ్వడానికి వారికి తగిన సమయం ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ మార్చవలసిందేనని జోగులాంబ గద్వాల జిల్లా స్వేరో అధ్యక్షులు బండారు సునంద డిమాండ్ చేశారు





