Wednesday, January 21, 2026

టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టండిమామిడిపండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల యజమానులకు జిల్లా కలెక్టర్ సూచనజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

నేటి సాక్షి ; తిరుపతి జిల్లా (బాదూరు బాల)*రేణిగుంట**మామిడిపండ్ల గుజ్జు తయారీ పరిశ్రమల వద్ద టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్.వెంకటేశ్వర్ పరిశ్రమల యజమానులకు సూచించారు. మంగళ వారం రేణిగుంట మండలం, ఎస్ఎన్ పురం గ్రామంలోని శ్రీ వర్ష ఫుడ్ ప్రాడక్ట్ ఇండియా లిమిటెడ్ కు చెందిన మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా తోతాపురి మామిడకాయలను తీసుకువచ్చిన రైతులకు ముందు వచ్చిన రైతులకు ముందుగా టోకెన్ జారీ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు.ముందుగా ఒక ట్రాక్టర్ మామిడికాయలను ఎంత బరువు ఉంటుందో పరిశ్రమలోని వే బ్రిడ్జి వద్ద బరువును పరిశీలించారు. రైతులు తీసుకువచ్చే మామిడి కాయలను నమోదు చేసే ప్రక్రియను సంబంధిత ఉద్యానవన శాఖ అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ముందుగా మామిడికాయలతో నిండి ఉన్న ట్రాక్టర్ ను బరువు వేయడం జరుగుతుందని,ఆ కాయలు అన్లోడ్ చేసిన తర్వాత ఖాళీ ట్రాక్టర్ బరువును తూచి ఖాళీ బరువును తీసివేసి మిగిలిన బరువును నమోదు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పరిశ్రమలో మామిడికాయలను నిల్వ ఉంచిన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ వర్ష ఫుడ్ ప్రోడక్ట్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ విశ్వనాథ నాయుడు తమ యూనిట్లో 250 నుండి 300 టన్నులవరకు నిల్వ ఉంచుకొనే సామర్థ్యం ఉందని తెలిపారు. ప్రస్తుతం 15 రైపనింగ్ చాంబర్స్ లో పూర్తిస్థాయిలో మామిడికాయలు నిల్వలు ఉన్నాయన్నారు. అందుకనే తాము ఇంకా రైతుల వద్ద నుంచి మామిడి కాయలను అన్లోడ్ చేయలేదన్నారు.అనంతరం మామిడి పండ్లను శుద్ధి చేసే తీరును అక్కడి నుండి వాటిని గుజ్జుగా తయారు చేసే విధానాన్ని ఆ పరిశ్రమ డైరెక్టర్లు విశ్వాస్, వర్ష లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఆ యూనిట్ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.**ఈ సందర్భంగా అక్కడే ఉన్న మామిడికాయలను తీసుకువచ్చిన రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తమ తోతాపురి మామిడికాయలను పూర్తి కాపు అయ్యేంతవరకు స్థానిక మామిడి పండ్ల గుజ్జు తయారీ పరిశ్రమలు కేంద్రాలు రైతుల నుండి మామిడికాయలను తీసుకుంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడిపళ్ళ గుజ్జు తయారి పరిశ్రమ యజమానులకు కేజీకి 8/- రూపాయలు చొప్పున రైతులకు అందించాలని సూచించిందని, అదే సమయంలో ప్రభుత్వం నుంచి రైతులకు ఒక కేజీకి నాలుగు రూపాయల చొప్పున సబ్సిడీని కూడా ప్రభుత్వం రైతులకు అందిస్తుందన్నారు. జిల్లాలోని తోతాపురి మామిడికాయల రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి పరిశ్రమ వద్ద ఉద్యానవన శాఖ అధికారులను,రెవెన్యూ అధికారులను ఏర్పాటు చేశామని, వారు రైతులు మామిడి పండ్ల పరిశ్రమల గుజ్జు తయారీ కేంద్రాల వద్దకు తీసుకువచ్చే మామిడికాయల టన్నులను నమోదు చేసుకోవడం జరుగుతోందన్నారు. ఆమేరకు ప్రభుత్వం అందించే సబ్సిడీని రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఎప్పటికప్పుడు రైతులు తీసుకొని వచ్చే మామిడికాయల వివరాలను కంప్యూటరీకరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముందుగా స్థానిక రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత పల్ప్ యూనిట్ల యజమానులకు జిల్లా కలెక్టర్ సూచించారు.*ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీడీ సతీష్, మార్కెటింగ్ ఎడి సురేంద్రబాబు,స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News