నేటి సాక్షి, నారాయణపేట అక్టోబర్ 23,నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు నారాయణపేట టౌన్ ట్రాఫిక్ ఇంచార్జిగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ చైతన్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా కేంద్రంలో వాహన రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం ఈ నియామకం చేపట్టినట్లు ఎస్పీ గారు తెలిపారు. టౌన్ లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్ఐ కి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలులో ఉండేలా, ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేయాలని ట్రాఫిక్ ఎస్సైకి సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ — “జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మరియు ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించేలా పోలీసులు కృషి చేయాలి” అని అందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ తెలిపారు.





