నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
వరంగల్ అడిషనల్ డీసీపీ లా, ఆర్డర్ మరియు ట్రాఫిక్ రాయల ప్రభాకర్ రావు కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ మరియు సి పి ఓ జంక్షన్ లను సందర్శించటం జరిగింది. ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ హనుమకొండ ట్రాఫిక్ సి ఐ కి, ట్రాఫిక్ కు సంబందించిన పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్ లో వెహికల్స్ సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని, ఫుట్పాత్ ల ఆక్రమణలు లేకుండా చూడాలని, అవసరమైన చోట నో పార్కింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ పైప్స్ వాల్వ్ ల వద్ద వేసిన ఐరన్ జాలీలు రోడ్ కంటే ఎత్తుగా ఉన్నందున వాటిని రోడ్ ఎత్తుకు చేయవచ్చేమో చూడాలని అలాగే జంక్షన్స్ లో ట్రాఫిక్ సిబ్బంది అలెర్ట్ గా ఉండి ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

