నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఈదులగూడ శివారులో గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ గత కొన్ని సంవత్సరాలుగా చెత్త పేరుకొని పోయి, దాని ద్వారా చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆ సమస్యకు పరిష్కారం చూపేందుకు డంపింగ్ యార్డ్ లోని చెత్తను రీసైకిల్ చేసి చెత్తను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రైవేట్ కంపెనీ వారితో చర్చించి, వారితో కలసి గురువారం డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ,అతిత్వరలో ఇక్కడ నుంచి చెత్తను తొలగించి, పట్టణ ప్రజలకు, చుట్టూ పక్కన గ్రామాల ప్రజలకు డంపింగ్ యార్డు సమస్యని పూర్తిగా పరిష్కరిస్తామని అందుకు అవసరమైన విధి విధానాలపై మున్సిపల్ అధికారులకు తగు సూచనలు చేశారు. వారి వెంట సంబంధిత అధికారులు, కాంగ్రేస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





