నేటి సాక్షి ప్రతినిధి: గుమ్మడిదల:
– పార్టీలకు అతీతంగా మండల ప్రజల ప్రయోజనమే ముఖ్యం
– ప్రాంతం తర్వాతే రాజకీయాలు, పార్టీలు
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి
డంపింగ్ యార్డ్ విషయంలో మేము రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని, ప్రజల ప్రయోజనమే మాకు ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,
“డంపింగ్ యార్డ్ విషయంలో మేము మొదటి నుంచీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాం.
డంపింగ్ యార్డ్‌ను అడ్డుకునే ప్రయత్నంలోనే ప్రజలకు సహకారం అందించాం.
ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మద్రాసులో దాఖలైన పిటిషన్ నేడు విచారణకు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది,” అని తెలిపారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నల్లవల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ దోమడుగు శంకర్, జేఏసీ నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.