Monday, March 16, 2026

డబిల్ గూడ ప్రధాన రహదారి గుంతల మయం – బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. *

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 05:)*మహేశ్వరం మండలంలోని డబిల్ గూడ గ్రామ ప్రధాన రహదారి గుంతల మయమై గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ మహేశ్వరం మండల శాఖ ఆధ్వర్యంలో,మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ఉపేందర్ అధ్యక్షతన డబిల్ గూడ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ:-డబిల్ గూడ గ్రామంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ కావాలనే మా గ్రామ రోడ్డు పనులను నిలిపివేశారు అని ఆరోపించారు. ముఖ్య అతిథి కుండే వెంకటేష్ మాట్లాడుతూ తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మహేశ్వరం మండలంలో ప్రతి చోట అడ్డుకుంటాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బుగ్గని శంకర్,జిల్లా కార్యదర్శి యాదయ్య గౌడ్,గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు దేశ్య నాయక్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్,మంత్రి ముత్యం, గోపాల్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్, ఉపాధ్యక్షులు రూప్ సింగ్, కంది శ్రీను, బొమ్మ దేవేందర్, కాసాని ఆనంద్, బీజేవైఎం జిల్లా నాయకులు బొర్రా సాయిలు, భారత్, మాధవ్, బొర్రా మహేష్, ప్రకాష్, దేవేందర్, జనార్ధన, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News