నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………. ఈ రోజు ప్రజవనిలో జిల్లా కలెక్టర్ కి భరత్ సురక్ష సమితి నాయకులూ వినతిపత్రం సమర్పించారు. నాయకులూ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదా రులకు డిసెంబర్ 31 చివరి తేదిగా కాకుండా ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పొడిగించాలని,డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటు లోకి రాకపోవడంతో పలువురు లబ్దిదారులు గృహప్రవేశం చేయలేకపోతున్నారని, ఇల్లు ప్రతి కుటుంబానికి కల అని, శుభదినాన్ని చూసుకొని స్తోమతకు అనుగుణంగా గృహప్రవేశం చేయాలనే ఆకాంక్ష లబ్దిదారుల్లో ఉందని తెలిపారు. ప్రస్తుతం శుభకార్యాలకు అనుకూలమైన రోజులు లేకపోవడంతో ఫిబ్రవరి వరకు అవకాశం కల్పించాలని కోరారు. ఫిబ్రవరి నెల వరకు గడువు ఇస్తే, కరెంటు మీటర్లు ఏర్పాటు చే

