Tuesday, July 22, 2025

డబ్బు కొసం మేనత్తను హతమార్చిన మేనల్లుడు అరెస్టు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసమైన డబ్బు కొసం మేనత్తను అతి దారుణం హత్యచేసి ఒంటి మీద వున్న నగలను చోరీ చేసిన మేనల్లుడి గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు 18 లక్షల విలువగల సుమారు 170 గ్రాముల బంగారు, 34 గ్రాముల వెండి అభరణాలతో పాటు పదివేల రూపాయల నగదు, ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు రేకులపెల్లి ప్రణయ్ వయస్సు 23, రాజీవ్‌కాలనీ, మట్వాడా, వరంగల్‌ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టుకు సంబందించి ఈస్ట్‌జోన్‌ డిసిపి అంకిత్‌ కుమార్‌ వివరాలను వెల్లడిస్తూ, ఈ నెల 7వ తారీఖున గీసుగొండ మండలం, స్థంబాలపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప వయస్సు 70 సంవత్సరాల వృద్దురాలిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అదేశాల మేరకు ఈస్ట్‌జోన్‌ డిసిపి అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు ప్రస్తుతం పోలీసుల వద్ద వున్న టెక్నాలజీని వినియోగించుకోని వృద్దురాలని దారుణంగా హత్య చేసింది మృతురాలి మేనల్లుడు వరంగల్‌ మట్టెవాడ ప్రాంతం, రాజీవ్‌ కాలనీలో నివాసం వుండే రేకులపెల్లి ప్రణయ్ పోలీసుల దర్యాప్తులో నిర్థారణ కావడంతో పోలీసులు నిందితుడిని శుక్రవారం ఉదయం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌ తరలించి విచారించగా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు ప్రవైయిట్‌ ఉద్యోగాన్ని చేస్తూ వచ్చిన జీతంతో మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవాడు. అలాగే తన జల్సాలతో పాటు ద్విచక్ర వాహనం కోనుగొలు చేసేందుకు ఇతరుల వద్ద నుండి పెద్ద మొత్తం అప్పులు చేసాడు. డబ్బులు తిరిగి ఇవాల్సిందిగా అప్పు ఇచ్చిన వాళ్ళు నిందితుడుపై ఒత్తిడి తీసుకరావడంతో, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించేందుకు తాళం వేసిన ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో గీసుగొండ, మట్టెవాడ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రెండు చోప్పున మొత్తం నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. అయిన నిందితుడి అప్పులు తీరక పోవడంతో పాటు జల్సాలు మరింత చేయసాగాడు. ఈ క్రమంలో గీసుగొండ స్థంబాలపల్లి గ్రామంలో ఒంటరిగా నివాసం వుంటున్న తన మృతురాలైన తన మేనత్తపై నిందితుడి దృష్టి పడింది. ఆమె వద్ద పెద్ద మొత్తం డబ్బు వుంటుంది ఆమెను చంపి డబ్బు, బంగారం దోచుకోవచ్చని అలోచనతో ఈ నెల 7న తన మేనత్త వద్దకు వస్తున్నట్లుగా సమచారం ఇచ్చాడు స్థంబాలపల్లి వెళ్ళే మార్గం మద్యం దుకాణంలో రెండు బీరు సీసాలను కొనుగోలు చేసి తన మేనత్త ఇంటికి చేరుకున్నాడు. మేనత్త తో కలిసి మద్యం సేవించిన అనంతరం మృతురాలి ఇంటిలోనే నిద్రించాడు. మృతురాలైన మేనత్త గాడ నిద్రపోతున్నది అని నిర్థారించుకున్న నిందితుడు వ్యాయామం సామగ్రి అయిన డంబెల్‌తో మేనత్త తలపై కొట్టడంతో మృతురాలు స్వరూప సంఘటన స్థలంలోనే మరణించింది. తన మేనత్త మరణించినట్లుగా నిర్థారించుకోని నిందితుడు ప్రవీణ్‌ తన మృతురాలి ఒంటిపై వున్న బంగారు అభరణాలతో పాటు ఇంటిలోని వెండి సామాను, కొంత డబ్బును దోచుకొని వెళ్ళాడు. అనంతరం నిందితుడు హత్య చేసే క్రమంలో తన చేతిని గాయం కావడంతో వరంగల్‌ లోని తన ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటిపై వున్న రక్తపు మరకలతో కూడిన బట్టలను తన ఇంటిపై విప్పి అనంతరం స్థానిక యం.జి.యం వెళ్ళి చేతికి చికిత్స చేయించుకున్నట్లుగా నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడిని పట్టుకొవడం ప్రతిభ కబరిచన గీసుగొండ్‌ పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని డిసిపి అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News