నేటి సాక్షి మంచిర్యాల్ జనవరి 31 (శ్రీధర్ దమ్మ )మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కత్తెర గుర్తుతో బరిలో దిగిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న ఆశీర్వాదంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ గారి సూచనలతో, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సతీమణి కుంటాల మౌనిక మహేష్ వర్మ లు 20వ డివిజన్ లో పోటీ చేస్తుండగా, 14వ డివిజన్ నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు పుట్ట లావణ్య ఉన్నారు. అధికారం, ఆత్మగౌరవం, వాటా సాధించేందుకు అధికారమే అంతిమ లక్ష్యం అని తెలిపారు. ఎవరెంతో వారికంత నినాదంతో , డబ్బు రాజకీయాల జబ్బును వదిలించేందుకు కత్తెర గుర్తుతో ముందుకు వస్తున్నట్లు 20వ డివిజన్ అభ్యర్థి కుంటాల మౌనిక మహేష్ వర్మ లు అన్నారు.





