నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 15,డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ గారికి ఫోన్ ద్వారా తీలేరు నుంచి మరికల్ ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు రేడియం స్టిక్కర్లు, లేకపోవడంతో, ముఖ్యంగా రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి బారికేడ్లపై రేడియం స్టిక్కర్లు వేయించాలని ఎస్పీ గారికి వినతి చేశారు.ఈ ఫిర్యాదును అత్యంత ప్రాముఖ్యంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీసు సిబ్బందికి వెంటనే ఆదేశాలు జారీ చేసి, రోడ్డుపై ఉన్న బారికేడ్లకు రేడియం స్టిక్కర్లు తక్షణమే అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి సూచనలు ఎంతో ఉపయోగకరమని, డయల్ యువర్ ఎస్పీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును గౌరవించి తక్షణమే స్పందిస్తామని ఎస్పీ తెలిపారు.





