* నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పిట్టల వాని పాలెం) బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని పిట్టల వాని పాలెం సంగుపాలెం గ్రామంలో క్రీస్తు నిరీక్షణ ప్రార్థన మందిరము మరియు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన (శనివారం) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన కరపత్రములను సోమవారం స్థానిక గౌరవ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎజ్రా శాస్త్రి సౌపాటి ఈ సెమీ క్రిస్టమస్ వేడుకలకు గౌరవ శాసనసభ్యులు ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఎల్ వెంకటపతి రాజు , నరసరాజు , దీనబాబు , బర్మా జాన్ బాబు , చెరుకూరి యాదయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.





