నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : సోమవారం గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని పాల్వాయి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే గారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు కొరకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది
ఎమ్మెల్యే మాట్లాడుతూ ….
భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
నేటి యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్,జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, మాజీ సర్పంచ్ శివరాం రెడ్డి నాయకులు సీతారాం రెడ్డి, అజయ్, వెంకటన్న, కురుమన్న, జీవన్ రెడ్డి, ఎల్లప్ప, రంజిత్ ,మహేష్ వీరేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

