నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురు కుప్పం*మండలంలోని డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దివాస్ సందర్భంగా కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద ఆధ్వర్యంలో విజిలెన్స్, విద్యార్థుల బాధ్యతలు గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటసుబ్బయ్య ఆదేశాల మేరకు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు కే.వరలక్ష్మి,పి.రేణుక పాల్గొన్న వారు మాట్లాడుతూ బాల్యవివాహాలు డ్రగ్స్ వాడకం వాటి శిక్షలు అవినీతి, సైబర్ క్రైమ్ వంటి ముఖ్యమైన విషయాలను క్షుణ్ణంగా వివరించారు విద్యార్థులు భావితరాల్లో దిశ నిర్దేశంగా నడుచుకోవాలని దేశ ఐక్యతకు పాటుపడాలని అదేవిధంగా దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.పోలీస్ సిబ్బంది తెలిపిన విషయాలను పాటించి సొంత ఊరికి,కళాశాలకు మంచి పేరు తేవాలని కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులకు తెలియజేశారు. చివరగా మహిళా పోలీస్ వారికి ప్రిన్సిపల్ శాలువాతో సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి కళాశాల ఎన్ఎస్ఎస్ డాక్టర్ సి.మంగళ గౌరీ ,ఐక్యూఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.వెంకటేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేత్ర బృందం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.





