నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెదురుకుప్పం మండలలోని డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరమునకు గాను స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.అన్నపూర్ణ శారద బుధవారం ప్రకటనలో తెలిపారు. కళాశాలలో డిగ్రీ ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైందని, కళాశాలలోని ఇంటర్మీడియెట్ తత్సమానమైన అర్హత కలిగిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు విద్యా శాఖాధికారులకు విన్నవించామని తెలిపారు.కోర్సులలో చేరాలనుకొనే వారు 21-11-2025 లోపు సంప్రదించాలని కోరారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో అందుబాటులో ఉండే వివిధ కోర్సులు, బీఏ హానర్స్ ఎకనామిక్స్, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రూపులన్నీ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో చేరదలిచిన వారు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ (టీసీ, స్టడీ, బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్,) ఒరిజినల్తో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలతో కళాశాలలో ఈ నెల 21వ తేదీ లోపు సంప్రదించాలన్నారు. వివరాలకు.. భరణి నాథ్ రెడ్డి 9885125771, నరేంద్ర బాబు 7702917803, భీమ మోహన రావు 9704425888 సంప్రదించాలని కోరారు. నెంబర్లకు





