నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) *వెదురుకుప్పం*అక్టోబర్ 15:మండలంలోని కేంద్రం లో ఉన్న డా. వై.ఎస్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జీఎస్టీ 2.0 రెండవ దశ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.అన్నపూర్ణ శారద అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో పన్నుల విధానం, జీఎస్టీ ప్రాముఖ్యత, ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వాణిజ్య విభాగాధిపతి జీఎస్టీ 2.0 యొక్క కొత్త మార్పులు, వ్యాపార వృద్ధి పై దాని ప్రభావం, డిజిటల్ ట్యాక్స్ వ్యవస్థ సౌలభ్యాల సౌలభ్యాల గురించి ఎకనామిక్స్ లెక్చరర్ డాక్టర్.డి లావణ్య కుమారి వివరించారు.అనంతరం విద్యార్థుల కోసం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు మరియు ఫోటో ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.చివరగా కళాశాల ప్రాంగణం నుండి భారతం మిట్ట సర్కిల్ వరకు జిఎస్టి 2.0ఫై నినాదాలతో మానవహారం చేశారు.ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ సమన్వయకర్త, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.





