Saturday, March 21, 2026

*డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యవసాయ రంగంలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)వెదురుకుప్పం డాక్టర్ వైయసర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉమన్ ఎంపౌవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో 2025 డిసెంబర్ 8 న వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి సి. వనితా హాజరై, మహిళల పాత్ర వ్యవసాయ రంగంలో ఎంత ముఖ్యమైందో వివరించారు. ఆమె మాట్లాడుతూ “మహిళలు వ్యవసాయ రంగ అభివృద్ధికి మార్గదర్శకులవుతున్నారు. వారి సాధికారత ద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద, కళాశాల ఉమన్ ఎంపౌవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.రుష్మ, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ పి.వెంకటేశు,డాక్టర్ వి.ప్రభాకర్ రావు, డాక్టర్ సి. అరుణ, అధ్యాపకులు మరియు విధ్యార్థిని విధ్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వ్యవసాయ రంగంపై అవగాహన పెంచడమే కాక, మహిళల సామర్థ్యం పట్ల గౌరవాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News