నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణంలో సోమవారం బిజెపి ఆధ్వర్యంలో శ్యాంప్రకాష్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కుర్మ మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశ ముద్దుబిడ్డ ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పరిస్థితులను ప్రపంచానికి అర్థం చేసే విధంగా ఉద్యమం నిర్వహించి ఏక్ దేశమే ధో నిశాన్ అనే విధానం ధో ప్రధాన్ నహి చలేగా నహి చలేగా అంటూ ఈ దేశంలో అమలుపరిచిన భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు పరచాలని ఉద్యమించారని తెలిపారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం కారణంగానే జమ్మూ కాశ్మీర్ కు విముక్తి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు కోణారపు భూమేష్, బన్న సంజీవ్, ఉపాధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, చికోటి ఎల్లా గౌడ్ ,అల్లే నరసయ్య ,తాజా మాజీ ప్రధాన కార్యదర్శి కంబోజి రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు కురుమ నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్జి , జోగా గంగరాజం, మోహన్ జి, బుడగం లింగారెడ్డి, ఆసరి మల్లేష్, సురతాని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 23RKL02: శ్యాంప్రకాష్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం

