Thursday, January 22, 2026

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి నాయకులు..

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) :డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు..
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఘసందర్బంగా సోమవారం డికె. బంగ్లా లో బిజెపి పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బిజెపి నాయకులు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ..

ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదని, ఆర్టికల్ 370 వెంటనే రద్దు చేయాలనే ఉద్యమ క్రమంలో 1953 జూన్‌ 23వ తేదీన బలిదానం కావడం జరిగిందని తెలిపారు. గొప్ప జాతీయవాద నాయకుడు, భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రతి బూతులో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, ఆయన కలలు కన్న ఏక్ భారత్ మరియు శ్రేష్ఠ భారత్ ను స్మరించుకోవాల్సిందిగా కోరుచున్నాము.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ లో 11మొక్కలు నాటాలని అందులో భాగంగా ఈ రోజు డికె బంగ్లా లో మొక్కలు నాటడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండల వెంకట రాములు ,అక్కల రమాదేవి, జిల్లా ఉపాధ్యక్షుడు రజక నర్సింలు ,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాసు, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్ , జిల్లాఐటీ సెల్ కన్వీనర్ చిత్తారికిరణ్, గద్వాల మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు డబ్బిలేటి నర్సింహ, బిజెపి సీనియర్ నాయకులు ఢిల్లీవాల కృష్ణ, మోహన్ రెడ్డి,రమేష్ తదితరులు ఉన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News