నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)*రామచంద్రాపురం* తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ది మిత్ర కిట్స్ పాఠ్య పుస్తకాలు ,స్కూల్ యూనిఫాం లను గురువారం మండలంలోని కమ్మపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చినబాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య వల్ల సాధ్యపడుతుందని ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మౌలిక వసతులతో పాటు విద్యను అందించాలని కోరారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థులకు నైతికత పెంపొందించే విధంగా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు దృష్టి లో ఉంచుకొని అన్నిరంగాల్లో ముందుకు వెళ్ళేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సభాపతి, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు ,శోభారాణి, చంద్రశేఖర్ నాయక్, కామేశ్వరి,జయశ్రీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు