Saturday, March 21, 2026

డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వర్థంతి సందర్బంగా ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో ఆశయాలతో నడవాలి..సామాజిక వేత్త.. డాక్టర్. నాగన్న…….

నేటి సాక్షి. పాములపాడు 06 :-మండల కేంద్రమైన పాములపాడులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సామాజిక వేత్త డాక్టర్ డి.నాగన్న, భామ్సెప్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, ఎస్ఐ- కే.సురేష్ బాబు, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గట్టు శంకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి డాక్టర్ బత్తుల. సంజీవరాయుడు, డీవీఎంసీ మెంబర్ లింగాల. నాగరాజు, మండల కో ఆఫ్టెడ్ మెంబర్ సయ్యద్.ముర్తుజా అలీ, ప్రజాసంకల్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భముగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఈరోజు డిసెంబరు 6వ తేదీకి చాలా ప్రాముఖ్యత వుంది.బాబా సాహెబ్ అంబేద్కర్ అమరుడయిన రోజు 6 డిసెంబరు 1956 కనుక ఆయన దళిత, గిరిజన, శ్రమ జీవుల, స్త్రీల బానిస విముక్తి, హక్కులు కల్పించిన మహనీయుడు, మైనారిటీ,సమస్త పీడిత ప్రజల హక్కులకై రాజ్యాంగ బద్దంగా ఆయన పోరాడడమే గాక ఆ హక్కులను రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడు అంబేద్కర్.ఫూలే ప్రారంభించిన సామాజిక న్యాయ సిద్దాంతాన్ని అభివృద్ధి చేసి కొనసాగించడంతో పాటు, తాను రూపొందించిన,కుల నిర్మూలనా సిద్ధాంతాన్ని సామాజిక న్యాయ సిద్ధాంతంతో జోడించి కృషి చేసిన సిద్దాంత వేత్త అంబేద్కర్.మన దేశ ప్రజల బాధలకు కారణం అయిన మనుస్మృతిని దహనం చేసినవాడు అంబేద్కర్. డిసెంబరు 6వ తారీఖుననే 1992లో మనువాద,మతోన్మాద శక్తులు బాబ్రీ మసీదుని కూల్చారు. అంబేద్కర్ ప్రారంభించిన మనువాద వ్యతిరేక పోరాటం ఆపవలసింది కాదని మరింత శక్తివంతంగా కొనసాగించ వలసి వుందనిడిసెంబరు ఆరవ తేదీ మనకు చాలా బలంగా గుర్తింప చేస్తున్నది.కావున రానున్న రోజుల్లో ఆయన ఆశయం ఒక్కటే బహుజనులు రాజ్యాధికార దిశగా నా ప్రజలు ఎదుగుతారో అప్పుడు నాకు సంతోషం అని ఆనాడే అన్న మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు రాసిన రాజ్యాంగం ను బాగా చదివి అందులోని హక్కులు,ఆర్థికల్స్,సెక్షన్లు పరిపాలన వ్యవస్థ ను గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కలబండి. నాగరాజు సోషల్ మీడియా ప్రతినిధి, నల్లమల అబ్రహం, కలబండి.అంకన్న.సీ. పి. యం. స్వామాన్న, బీ. సి. సంఘం నాయకుడు గట్టు. శంకర్, శెట్టి శివ లింగం వై ఎస్ ఆర్ , నాయకులు కో ఆప్షన్ మెంబర్. మూర్తుజావళి, డక్కా.శ్రీకాంత్, సోషల్ మీడియా ప్రతినిధి టీడీపీ. నాయకులు, వెంకటస్వామి, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు, కలబండి. నాగన్న, గోవిందు ప్రజా ప్రతినిధి, వడ్డెర. రాష్ట్ర. అధ్యక్షుడు బత్తుల. సంజరాయుడు, దామోదర రెడ్డి. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News