Friday, March 20, 2026

డిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయుటకై ఎమ్మార్వో కి మెమోరాండం..

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ మండల పరిధిలో నీ ఎమ్మార్వో కి 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి నాయకులు ఆధ్వర్యంలో మాజీ జస్టిస్ ఈశ్వరయ్యఎమ్మార్వో మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవిలు డా ” విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మార్వో కి 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చి అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలుపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రిజర్వేషన్లను బీసీలకు అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్లో ఒత్తిడి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు పెద్ద ఎత్తున రాష్ట్ర రోకోలు, ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఈ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ ఎస్సి ఎస్ టీ జేఏసీ 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తుందని దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు కలిసి ఎస్సీ ఎస్టీలు మద్దతుతో ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుందని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సి ఎస్ టీ జేఏసీ నాయకులు రవీందర్ మహారాజ్, వెంకటేష్ రాజు, మల్లికార్జున్, పద్మశాలి సంఘం నాయకులు వనంపల్లి ఆంజనేయులు, శేఖర్, నాయి బ్రాహ్మణ సంఘం సంతోష్, ముదిరాజ్ సంఘం నాయకులు గోపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News