నేటి సాక్షి, కోరుట్ల టౌన్*(గణేష్ గొల్లపల్లి)కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు కోరుట్ల,భిమారం,మేడిపల్లి,కథలాపూర్ మండలాల ఉన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుల డిజిటల్ లిటరసి పై 3 రోజుల శిక్షణ కార్యక్రమం ను మంగళవారం జిల్లా విద్యాధికారి కె.రాము సందర్శించారు.ఆయన మాట్లాడుతూ భౌతిక శాస్త్ర ఉపాద్యాయులు తప్పనిసరి విద్యార్థులకు కోడింగ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కంప్యూటర్ లిటరసి పై అవగాహన కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలని,ప్రతి విద్యార్థి పై ప్రత్యేకమైన చొరవ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి కె.రాజేష్,కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం,ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి మధు, ప్రధానోపాధ్యాయులు వి.గంగాధర్,రిసోర్స్ పర్సన్స్ కె.రాజ్ కుమార్ ch.నాగరాజు,సంతోష్ సి.ఆర్.పి లు పి.గంగాధర్,జ్యోతిలు పాల్గొన్నారు.





