Friday, February 27, 2026

*డిజిటల్ హెల్త్ కార్డు ల పై అపోహలు వద్దు**ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలు వద్దని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి అన్నారు.ఈ రోజు ఓల్డ్ హైస్కూల్లో పని చేస్తూ ఈనెల లో ఉద్యోగ విరమణ పొందుతున్న రాళ్ల బండి సావిత్రి మోహన్ రెడ్డిస్కూల్ అసిస్టెంట్ (సోషల్) గారి సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ హెల్త్ కార్డుల నిర్వహణ ప్రత్యేక ట్రస్ట్ ద్వారా నిర్వహణ ఉంటుందని వారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్స్ కు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ ఈ స్కీము అన్లిమిటెడ్ గా వర్తిస్తుందని వారన్నారు. అదేవిధంగా సర్వీసు రూల్స్ కు త్వరలోనే పరిష్కారం లభించి పదోన్నతులు వస్తాయని వారన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం శాసనమండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, పిఆర్సి సాధన కోసం త్వరలోనే ఉద్యమిస్తామని అన్నారు. పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వంపై పోరాడుతామని వారన్నారు. జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమే, సేవకు కాదు అని ఉద్యోగ విరమణ అనంతరం సేవ చేయాలని వారు అన్నారు అనంతరం సావిత్రి సేవలను కొనియాడారు సావిత్రి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ పిఆర్టియు టిఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి, పీ ఆర్ టి యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, అమ్మ అదర్శ పాఠశాల చైర్మన్ సుజాత, జిటిఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News