Saturday, March 21, 2026

డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటమేంటని చురకలు..నారా చంద్రబాబు నాయుడు తన ఇల్లు, వ్యాపారాలను ఆంధ్రకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్న.. ఉండవల్లి అరుణ్ కుమార్

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 06 ~అన్నమయ్య జిల్లా :-: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ పొలిటీషన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం సరికాదని ఉండవల్లి అరుణ్ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ లో సీఎం లక్షణాలున్నాయని నేను నమ్మిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమేసిందని డిప్యూటీ సీఎం హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఒక హుందాగా ఉన్న వ్యక్తి కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఇల్లు, వ్యాపారాలు ఎందుకు ఆంధ్రకు తీసుకురావడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. మరోవైపు, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఎంత కాలం కొనసాగుతుందో చూడాలన్నారు. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే టీడీపీ – జనసేన – బీజేపీ జత కలిసాయని ఏం జరిగిందో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే..—————————–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News