Sunday, April 12, 2026

డిసెంబర్ 9 లోపు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి లేనియెడల పిఆర్టియు ఉద్యమ బాట.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి

నేటి సాక్షి (కరీంనగర్) PRTU TS కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు అయిలేని కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన TNGO’S ఫంక్షన్ హాల్ కరీంనగర్ నందు జరిగిన సర్వసభ్య సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో 100 రోజులలోపు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పి.ఆర్.సి, డిఏలు పెండింగ్ బిల్స్ ఇస్తామని మాట ఇచ్చి ఆశలు చూపి అధికారము లోకిరావడం జరిగిందని ఇందులో మొదటి తారీకున జీతాలు తప్ప ఏ ఒక్క సమస్యను పూర్తిగా పరిష్కారం చేయలేకపోయిందని ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్ ను సంవత్సరాల కొద్దీ పెండింగ్లో పెట్టి వారినీ తీవ్ర ఇబ్బంది పెడుతున్నదని 30 సంవత్సరాలు కడుపు కట్టుకొని పైసా పైసా కూడా కొట్టుకొని దాచుకున్న సొమ్మును ఇవ్వకపోవడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమే, కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందనీ డిసెంబర్ 9 లోపు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కలిసివచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యమ కార్యాచరణ పిఆర్టియు ప్రకటిస్తుందని ఎవరు ముందుకు రాని సందర్భంలో పిఅర్టియు ఒక్కటే ఉద్యమ బాటలో పయనిస్తోందని ఎవరు నిరాశ నిస్పృహలకు గురికావద్దని గతంలో సంఘ ఆధ్వర్యంలో అనేక జీవోలు తెచ్చి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఒడిలో పోసిందని, తన జెండా ఎజెండా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమేనని ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయనని ప్రకటించారు రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని సీనియర్లకే మండల విద్యాధికారులుగా ఇచ్చే ఉత్తర్వులు త్వరలో వస్తాయని తెలియజేశారు. తొలుత జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి స్వాగతోపన్యాసం తెలుపుతూ కరీంనగర్ జిల్లా సంఘ పక్షాన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు సంపూర్ణ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి రాష్ట్ర నాయకులకి 16 మండలాల అధ్యక్ష కార్యదర్శులకు ప్రాథమిక సభ్యులకి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జయపాల్ రెడ్డి తమ సుదీర్ఘ 28 పేజీల ప్రధాన కార్యదర్శి నివేదిక లో ఈ సంవత్సర కాలంలో చేసిన ప్రాతినిధ్యాలు సమస్యల సాధనలు పర్యటనలు ఆర్థిక నివేదిక తో పాటు పి ఆర్ టి యు ప్రాతినిధ్యంతో 21 గ్రామాలకు 17% హెచ్ఆర్ఏ వచ్చిన సందర్భాన్ని తెలియపరుస్తూ దీనికి సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ వారికి మరియు కరీంనగర్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తదుపరి ఆర్థిక నివేదిక సమర్పించ గా అందరూ ముక్తకంఠంతో దీన్ని ఆమోదించడం జరిగింది. పదోన్నతి పొందిన వందమంది ఉపాధ్యాయులకు జిల్లా శాఖ పక్షాన సన్మానించినది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసుంకరి బిక్షం గౌడ్, ఆడిట్ కమిట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మర్రి జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, జమీల్, దారం శ్రీనివాస్ రెడ్డి ,లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News