నేటి సాక్షి 10 ఫిబ్రవరి పాములపాడు :–పాములపాడు మండలం చెలిమిళ్ళ గ్రామపంచాయతీ కార్యదర్శి టి.కృష్ణప్రియ 2025-26 ఆర్థిక సంవత్సరానికి నందికొట్కూరు నియోజకవర్గంలో మొదటి స్థానంలో వందకు వంద శాతం ఇంటి పన్ను వసూళ్లు చేసిన సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కృష్ణ ప్రియ మేడం గారికి ఘనంగా డి జి పి ఓ లలితా బాయ్ శాలువాతో సత్కరించి,సన్మానించారు. ఆమె చేసిన ఉత్తమ సేవలకు పంచాయతీ రాజ్ కమిషనర్ నుండి మెమెరబుల్ | సర్టిఫికేట్ను నంద్యాల డిజిపిఒ పి.లలితా బాయ్, డిఎల్పిఒ డి.రాంబాబులు అందజేశారు. నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి ఆమె పని తీరును ప్రశంసించారు. చెలిమిళ్ళ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ రెండు చెలిమిళ్ళ లింగాల గ్రామాల్లో వంద శాతం వసూలు చేసినందుకు నాకు డిఎల్పిఓ తోటి అధికారులు శాలువ కప్పి ,ఈ ప్రశంసా పత్రంన్నీ , అందించి ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ ప్రశంసా పత్రం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మీద విధి నిర్వహణలో ఇంకా మంచి సేవలను అందిస్తానని అన్నారు.మా కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.





