నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 25,ఇటీవల నారాయణపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు ఈ రోజు జోగులాంబ గద్వాల జోన్ – 7 డీఐజీ శ్రీ ఎల్.ఎస్. చౌహాన్ ఐపీఎస్ మర్యాదపూర్వకంగా పూల బొకే అందించి కలిసారు. డి ఐ జి గారు ఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ వ్యవహారాలు, జిల్లాలో శాంతిభద్రత పరిస్థితులు, నేర నియంత్రణ చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై వంటి విషయాల పై చర్చించారు.





