Monday, December 23, 2024

డీసీసీ కార్యాలయంలో రాహుల్​ బర్త్​డే

నేటి సాక్షి, కరీంనగర్​: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బర్త్​డే వేడుకలను బుధవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. మొదట డీసీసీ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్​కుమార్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి కేక్​ కట్​ చేసి, పంచిపెట్టారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్​గాంధీ 4 వేల కిలోమీటర్లకు పైగా దేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేపట్టి, ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. రాహుల్ గాంధీకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో త్వరలో ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నామని అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీ ఆశయాలను అందిపుచ్చుకొని, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ఇండియా కూటమి 230కు పైగా సీట్లు సాధించి, భారత రాజ్యాంగ వ్యవస్థను కాపాడటంలో సఫలీకృతుడైన రాహుల్ గాంధీ నేటి తరం యువ రాజకీయ వేత్తలకు ఆదర్శప్రాయుడని ప్రశంసించారు. అనంతరం ఇందిరాచౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్​రెడ్డి హాజరై కేక్ కట్ చేసి, కార్యకర్తలు, అభిమానులకు పంచారు. మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఆధ్వర్యంలో కోతిరాంపూర్​లోని గిద్ద పెరుమాండ్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నా రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని సుభాష్​నగర్ ప్రభుత్వ పాఠశాలలో పెద విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేశారు. మైత్రి కన్వెన్షన్ వద్ద 25వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు దీకొండ శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్ బాలబద్రి శోభారాణి-శంకర్ ఆధ్వర్యంలో రేకుర్తి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి, పంచారు. సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హైమద్ అలీ ఆధ్వర్యంలో కరీముల్లాషా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్​కుమార్, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు చర్ల పద్మ, పులి ఆంజనేయులు గౌడ్ ,శ్రావణ నాయక్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, కొరివి అరుణ్​కుమార్, సిరాజు హుస్సేన్, వెన్నం రజిత, కుర్ర పోచయ్య, కల్వల రామచందర్, గోపు మల్లారెడ్డి, వంగల విద్యాసాగర్, నూనె గోపాల్​రెడ్డి, పోరండ్ల, రమేశ్​, నెల్లి నరేశ్​, మంద మహేశ్​, పొన్నం మధు, జీడి రమేశ్​, ఎండీ చాంద్, హస్తపురం తిరుమల, హసీనా, పర్వత మల్లేశం, మెతుకు కాంతయ్య, కుంభాల రాజకుమార్, పొలాస వాసు, మాదాసు శ్రీనివాస్, ఆసిఫ్, పరదాల లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News