Friday, March 20, 2026

*డ్యాం కూల్చివేత ఘటనపై తరలి వెళ్లిన గన్నేరువరం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు* *బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో**

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో మానేరు వాగుపై చెక్ డ్యామ్‌ పేల్చిన ఘటనా స్థలాన్ని మంగళవారం సిద్దిపేట మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీశ్ రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు.డ్యాం కూల్చివేత ఘటనపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు గన్నేరువరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో జంగపల్లి మాజీ ఎంపీటీసీ హనుమండ్ల మల్లేశం,మాజీ ఉప సర్పంచ్ అట్టికం రవి కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అట్టికం శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు తాడూరి వంశీకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తరలి వెళ్లారు..డ్యామ్ కూల్చివేత ఘటనపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ నిర్మాణం పై దాడి చేసి కూల్చి వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్య కేవలం సాధారణ విధ్వంసం కాదని దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందని అది కూడా బలమైన ఇసుక మాఫియా పనేనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బహిరంగంగా ఆరోపిస్తున్నారు.​​తనుగుల వాగులో కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల కోసమే ఈ అమానుష చర్యకు పాల్పడి ఉంటారని స్థానిక ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఈ చెక్ డ్యామ్ ఉండటం వలన నీటి నిల్వ కారణంగా ఇసుక తవ్వకాలకు అడ్డంకి ఏర్పడుతోంది. ఈ అడ్డంకిని తొలగించుకునేందుకే కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఇసుక మాఫియా ముఠా ఈ కుట్రపూరిత చర్యకు పాల్పడి ఉంటుందని అన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News