నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ నలుగురు నిందితులకు హుస్నాబాద్ కోర్టు మెజిస్ట్రేట్ ఒక్కరికి ₹10,000 చొప్పున 40,000₹జరిమానా విధించారని బెజ్జంకి ఎస్ఐ బి.సౌజన్య తెలిపారు.మద్యం మత్తులో వాహనం నడపడం ప్రమాదకరమై ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.





