Tuesday, April 14, 2026

డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ విద్యార్థులకు పోలిస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోపోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు డ్రగ్స్ పై పోలీసులు అవగాహన కల్పిస్తూ అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డ్రగ్స్ అనేది ఒక చెడు అలవాటు అని దానికి అందరూ దూరంగా ఉండాలని, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతీస్తుందని నిండు జీవితాలు పాడవుతాయని తెలిపారు. అలాగే పోస్టర్ను తయారు చేయడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలలో ముగ్గురు విద్యార్థులు గెలుపొందారు ఎ.మానస ప్రథమ బహుమతి, పి. వైశాలి ద్వితీయ బహుమతి, బి.అక్షిత తృతీయ బహుమతి పొందారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పీ. లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు కే. రామయ్య, లక్ష్మీనారాయణ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News