నేటి సాక్షి, నారాయణపేట,జనవరి 2,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని కనుమనూరు గ్రామంలో పలు వార్డులలో గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్ ఆధ్వర్యం లో శుక్రవారం నాడు డ్రైనేజీలా మరమత్తు పనులు చేపట్టారు. గ్రామంలో పలు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడంతో జెసిపిల ద్వారా మరమ్మత్తులను చేపట్టడం జరిగింది. మురుగు నీటిని చెరువులోకి పోయేటట్లు పనులు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రవి కుమార్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు రాములు,మల్లేష్, రవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

