నేటి సాక్షి పాములపాడు లోని, సేవా భారతి (వైఆర్డిఎస్) కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు-కలబండి.అంకన్న దేశంలోని, ఆంధ్ర,తెలంగాణ, ఇతర రాష్ట్రాలలో వాహనాలు నడిపే డ్రైవర్ అన్నలందరికీనమస్కరించి చెప్తున్నాను ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం మాడవద్దు, మద్యం సేవించి, ఓవర్ స్పీడుతో, నిదుర మబ్బులో ఆ జాగ్రత్తగా వాహనాలు నడపవద్దన్నారు.ఈ సందర్భంగా మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు- కలబండి.అంకన్న మాట్లాడుతూ డ్రైవరన్నలు మీ కష్టాలు మాకు తెలుసు కానీ, మితిమీరిన వేగం, భాద్యత లేకుండా తాగి నడపడం, నిద్రమత్తులో ఏదో రేసుల్లో పాల్గొనే వాళ్లకు వరల్డ్ కప్పు, గోల్డ్ మెడల్ ఇచ్చేటట్టు మీరు పోటీలు పడి మరీ అతి ఉత్సహంతో, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వలన ముఖ్యంగా మొన్న కర్నూలు లో, ఈరోజు చేవెళ్ళలో అంతకు ముందు నెల్లూరు సంగం దగ్గర కంకర టిప్పర్ యాక్సిడెంట్ లలో, ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఎన్ని కుటుంబాలను కకలా వికలం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ డ్రైవరన్న( ఏ టైర్ బ్లాస్టో, లేక ఏ సాంకేతిక లోపమో వల్ల ఐతే దేవుడు అక్కడి దాకా రాసి పెట్టి ఉన్నాడులే అనుకోవడం సహజం అన్నారు. కానీ ఈ దుర్ఘటనలలో మీ నిర్లక్ష్యం, మీ అబద్రత, మీ అత్యుత్సహం (బలే తోలా వయ్యా, బలే తిప్పవయ్యా, బలే తొందరగా తీసుకోపోయావయ్య అనే పొగడ్తల కోసం) ఓ డ్రైవరన్నలు మొన్న ఆ బస్సు, ఈరోజు ఈ బస్సు అందులోని ప్రయాణికులు, వారి కుటుంబాలు ఆలోచిస్తే గుండె బరువెక్కి పోతుందన్నారు. నా రెండు చేతులు జోడించి కాదు, కాదు అందరి చేతులు జోడించి బతిమాలుతున్నాం జాగ్రత్త డ్రైవరన్నలు మీరు, మీ కుటుంబాలు, మేము మా కుటుంబాలు కూడా బాగుండాలంటే అది మీ చేతులలో ఉందన్నారు.డియర్ యూత్, డ్రైవర్లు దయచేసి తాగి డ్రైవ్ చెయ్యొద్దు అన్నారు. మొన్న చూడు ఆ అబ్బాయి తాగడం వలన తన ప్రాణమే కాదు ఇతరుల ప్రాణాలు పోవడంలో కూడా కారకుడు అయ్యాడన్నారు. దయచేసి మనకే కాదు, ఇతరులకు ఆని కలగకుండా, ఇబ్బంది కలుగకుండా ఉందాం అన్నారు. ఐతే అయ్యింది లేటే కదా నిదానంగా, జాగ్రత్తగా వాహనాలు నడపాలని అన్నారు. కానీ మన పేరుకి ముందు “లేట్ ” పలానా లేట్ పలానా అని వచ్చేకంటే మహా అంటే తిడతారు, లేదంటే కొడతారు మరీ లేదంటే శాలరీ కట్ చేస్తారు అంతేగాని ప్రాణం తియ్యరు కదా అన్నారు. మన ప్రాణం దేవుడి చేతిలో ఉంది అది ఆయన తీసుకునే వరకు వేయిట్ చేద్దాం అని అన్నారు. ఏ విధంగా అయినా కూడా ప్రయాణికుల ప్రాణాలు గాని, మన ప్రాణం గాని మన చేతుల్లో ఎట్టి పరిస్థితిల్లో పోకూడదు కాబట్టి మీకు చేతులు జోడించి, నమస్కరించి చెబుతున్నాను జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్నారు.





