నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*ఏక వీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఢిల్లీలో జరిగిన అమానుష ఉగ్రదాడి , బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దానిని మానవత్వంపై చేసిన దారుణ దాడిగా పేర్కొన్నారు.ఈ దుర్ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంతహృదయవిదారకమని, ఆ బాధ కుటుంబ సభ్యులదే కాదు — మొత్తం దేశానిదని స్వామిజీ ఆవేదన వ్యక్తం చేస్తూఆవేశభరితంగా అన్నారు ఉగ్రవాదం అనేది ధర్మం కాదు — అది మానవత్వానికి శత్రువు.భయంతో జీవించే జాతి లేదు, ధర్మంతో జీవించే భారత్ ఉంది.అమాయకుల రక్తం చిందించినవారికి దైవ న్యాయం తప్పదనే సంగతి గుర్తుంచుకోండనని హెచ్చరించారు స్వామిజీ ఉగ్రవాదులకు కఠిన హెచ్చరిక జారీ చేస్తూ, “నిర్దోషుల ప్రాణాలను తీసిన దుష్టశక్తులు ఎప్పుడూ శాంతిని పొందవు; వారి దారుణం దేవుని న్యాయానికి తప్పించుకోలేరు” అన్నారు.ఆయన కేంద్ర ప్రభుత్వం మరియు భద్రతా సంస్థలు దృఢ చర్యలు తీసుకొని దేశ భద్రతను కాపాడాలని, అలాగే ప్రతి పౌరుడు శాంతి, ఐక్యత, మరియు జాగ్రత్తతో ఉండాలని పిలుపునిచ్చారు.ఈ ఉగ్రదాడిలో మరణించిన వారందరి కుటుంబాలకు స్వామిజీ ఆత్మీయ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దైవ ఆశీస్సులు అందించారు.“రక్తం చిందించేది బలహీనత, రక్షించేది ధర్మం.ఈ భూమిపై భయం కాదు, భక్తి నిలవాలని పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ అన్నారు





