నేటి సాక్షి 29 విజయవాడ :—- తంగడంచ ఫారం రాష్ట్ర విత్తన ఉత్పత్తి క్షేత్రంలోని 1600 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి మెగాసిడ్ పార్కు ,జైన్ పరిశ్రమ ను అభివృద్ధి చేసి స్థానిక యువత కు ఉపాధి కల్పించాలని. కేంద్రియ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఐఎస్ గారికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మేలు రకమైన విత్తన వంగడాలను (నేసనల్ సీడ్ ఫారం) ఒకప్పుడు దేశానికీ అందించిన తంగేడంచ ఫారం 1600 ఎకరాల ప్రభుత్వ భూములు నేడు అభివృద్ధికి నోచుకోక అటవీను తలపిస్తున్నాయరు. 2017లో ముఖ్యమంత్రి గా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు మెగాసిడ్ పార్కుమరియు జైన్ పరిశ్రమను ప్రారంభించారని, అయితే ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ భూములు అభివృద్ధి చెంధితే నందికొట్కూరు నియోజకవర్గం లో నిరుద్యోగ సమస్య పూర్తిగా రూపుమాపుతుందని,ఈ భూముల అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు.ఎవరు పట్టించుకోకపోవడం వల్లఅన్యాక్రాంతమవుతున్నాయి.ప్రస్తుతం జైన్ పరిశ్రమలో పట్టుమని పదిమంది కూడా ఉపాధి పొందే పరిస్థితి లేదన్నారు.. కావున ఈ భూముల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ప్రజలకు ఉపాధి కల్పించే ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఈ భూముల్లో ఏర్పాటు చేస్తే అన్ని సాగునీరు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.కావున భూముల అభివృద్ధికి దృష్టి కేంద్రీకరించాలని వారు కోరారు..

