Friday, March 13, 2026

తంగేడంచ గ్రామంలోని జైన్ ఇరిగేషన్ ను సందర్శించిన పాములపాడు కస్తూర్బా గాంధీ పాఠశాల స్కూల్ విద్యార్థులు :- ప్రిన్సిపాల్ యం. రాజ్యలక్ష్మి.

నేటి సాక్షి 04 మార్చి జూపాడుబంగ్లా:–నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలోని జైన్ ఇరిగేషన్ పరిశ్రమను శుక్రవారం రోజున పాములపాడు ప్రభుత్వ కస్తూర్బా గాంధీ పాఠశాల స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ప్రభుత్వం ఈ సంవత్సరం 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పాలిటెక్నిక్ లాంటి నూతనంగా సాంకేతిక విద్య కోర్సులను ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రవేశ పెట్టట్టింది. దీనికి అణుగుణంగా పాఠ్యంశాలలో ప్రధానంగా మొదటి అధ్యాయంలోనే వ్యవసాయ, అనుబంధ విషయాలపై ప్రత్యేక పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ మేరకు వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాములపాడు కస్తూర్బా గాంధీ పాఠశాల స్కూల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో జైన్ పరిశ్రమలోని వ్యవసాయ అనుబంధ క్రింద బిందు, తుంపర్ల సేద్యంపై అవగాహ న కార్యక్రమానికి సుమారు 72మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జైన్ పరిశ్రమ ఇంచార్జి మహేష్, లైజనింగ్ ఆఫీసర్ మౌలాలి, జైన వ్యవసాయ నిపణులు శ్రావణ్ కుమార్, షాపిర్ భాష, చైతన్య, రఫీ రాఘవేంద్ర విల్సన్, రాజు మరియు కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ యం. రాజ్యలక్ష్మి. మరియు పాఠశాల ఉపాధ్యాయులు మనీషా, జి.శ్యామల, శశికళ పి.ప్రవీణ, మేషత్, వై.అనురాధ, పీవీ.రవణమ్మ, విద్యార్థినులు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News