నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన పాత ములకలచెరువు కు చెందిన మంత్రి గిరిధర్ రెడ్డి పై మదనపల్లి కోర్టు ఆదేశాల మేరకు బి. కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయన తంబళ్లపల్లి టీడీపీ బహిష్కృత నేత దాసరపల్లి జయచంద్రారెడ్డికి స్వయాన భావవుతారు. ఈయన చెల్లి కల్పనా రెడ్డి ని దాసరపల్లి జయ చంద్రారెడ్డి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడాను నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్నారు. నకిలీ మద్యం కేసు వెలుగులోకి రాగానే బావా, బామర్ది ఇద్దరు దేశం విడిచి పారిపోయారు. ఇక విషయానికొస్తే దాసరపల్లి జయచంద్రారెడ్డి బామర్ది అయిన మంత్రి గిరిధర్ రెడ్డి బి. కొత్తకోట మండల కేంద్రమైన తుమ్మణం గుట్ట వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీ నడుపుతున్నారనే ఆరోపణలపై మదనపల్లి కోర్టులో మైన్స్ & జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ డి.వి.రంగాకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ చేపట్టి అనుమతులు లేకున్నా క్వారీ నడుపుతున్నారని విచారణలో వెల్లడి కాడంతో ఎట్టకేలకు మదనపల్లి కోర్టు తీర్పునిస్తూ ఆయనపై తక్షణమే కేసు నమోదు చేపట్టాలని బి. కొత్తకోట పోలీసులకు ఆదేశించారు. కోర్టు కు వెల్లడించిన ఆరోపణల మేరకు ఎన్ హెచ్ 42 జాతీయ రహదారి కి అతి సమీపంలో తుమ్మణం గుట్ట వద్ద ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 111 లో అక్రమంగా క్వారీ నడుపుతున్నారు. ఈ క్వారీ నడపడానికి ఎలాంటి అనుమతులు లేకున్నా రాజకీయ పలుకుబడితో వ్యాపారం మొదలెట్టారు. అయితే ఇంతలోనే అక్రమ నకిలీ మద్యం తయారీ కేసు ఇరు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో అక్రమ క్వారీ యజమాని మంత్రి గిరిధర్ రెడ్డి పై అభియోగాలు నిజం కావడంతో A18 నిందితుడిగా చేర్చారు. ఈ నకిలీ మద్యం తయారీ ఇంకా కొలికిరాకనే మదనపల్లి కోర్టు ఆదేశాల మేరకు మంత్రి గిరిధర్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మైన్స్ అధికారులు క్వారీని సీజ్ చేశారు. మంత్రి గిరిధర్ రెడ్డి పై కేసు నమోదు చేసిన ఆయన దేశంలో లేరు. దేశం విడిచి పారిపోయారు. నకిలీ మద్యం తయారీ కేసులో ఈయన బావ దాసరపల్లి జయ చంద్రారెడ్డి, మంత్రి గిరిధర్ రెడ్డి లపై కేసు ఇదివరకే నమోదైంది. అంతలోనే క్వారీ వ్యవహారంలో కేసు నమోదవ్వడంతో తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది..~~~~~~~~~~~~~~~~~~





