Saturday, April 11, 2026

తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం – మార్కెట్ చైర్మన్ పులిక్రిష్ణ- రైతులు ఆందోళన చెందవద్దని భరోసా – బెజ్జంకి మార్కెట్ యార్డులో తనిఖీ.

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 4 గంటల సమయంలో కురిసిన అకాల వర్షానికి రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యం తడిసింది. రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ తెలిపారు.మధ్యాహ్నం మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన, ఏపీఎం పర్శరాములు, మిల్లర్లతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు పూర్తి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు పుల్ల పోచయ్య, మచ్చ కుమార్, నాయకులు ఎర్రల రాజు, మల్లేశం, రంగోని రాజు, కత్తి రమేష్, శంకర్, పర్శరాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News