నేటిసాక్షి (కె గంగాధర్)పెగడపల్లిరాజారాంపల్లి గ్రామంలో గత 20 రోజుల నుండి పోసిన వరి ధాన్యం ఆకాల వర్షానికి తడిచి ముద్దయింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఐకిపీ సెంటర్ ను ప్రారంభించలేదు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు తక్షణమే ప్రజల పక్షాన ఉండి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవాలని మాట్లాడిన రాజారాంపల్లి బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో సాయిని రవీందర్,నాగుల రాజశేఖర్ గౌడ్,బండారి కనకయ్య, ఇస్లావత్ నరేష్ నాయక్, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, రైతులు పాల్గొన్నారు.





